Wednesday, 28 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

ఒక్క పనికి ఐదు రకాల బిల్లులు! నాయుడుపేట మండలంలో విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగం. స్పెషల్ ఆఫీసర్ల హయాంలో రూ. కోటికి పైగా నకిలీ బిల్లుల డ్రా? ఆయా గ్రామాల ప్రజలు ఉన్నతాధికారుల తనిఖీలకు డిమాండ్.

ప్రచురణకర్త / Publisher: KADAPA
📍 నాయుడుపేట
📅 ప్రచురణ: 10 Oct 2026, 10:42 AM
🔄 నవీకరణ: 19 Oct 2026, 07:27 AM
👁️ 5 views
Share this Article:

నాయుడుపేట, అక్టోబర్ 8, మహి న్యూస్: ప్రజాధనానికి రక్షణగా నిలవాల్సిన అధికారులే భక్షకులుగా మారితే ఎలా ఉంటుందో నాయుడుపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సాక్షిగా నిలుస్తోంది. మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల పేరిట జరుగుతున్న అక్రమాలు, నిధుల మళ్లింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకే పనికి పదే పదే బిల్లులు పెడుతూ, ప్రభుత్వ ధనాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారని మండల వ్యాప్తంగా ఆయా పంచాయతీల ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

పర్సంటేజీల పర్వంలో పంచుకున్నంత నాయాలు!

పంచాయతీల్లో ఏ చిన్న పని జరగాలన్నా పర్సంటేజీల డీల్ కుదరాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ స్థాయి పంచాయతీ అభివృద్ధి అధికారి నుండి మొదలుకొని, డిప్యూటీ ఎంపీడీవో, ఎంపీడీవో కార్యాలయ స్థాయి వరకు ప్రతీ పనికి ఒక నిర్దిష్ట శాతంలో నజరానాలు ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. పర్సంటేజీలు కుదిరితే చాలు అవసరం లేకున్నా, లేదా ఇప్పటికే పూర్తయిన పనులనే మళ్లీ కాగితాలపై సృష్టించి ఉద్దేశపూర్వకంగా నిధులు రాబట్టుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గత నాలుగు నెలల్లో రూ. కోటి పైనే గోల్‌మాల్!

సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయ్యాక ఏర్పాటు చేసిన 'స్పెషల్ ఆఫీసర్ల' పాలనను కొందరు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. గత నాలుగు నెలల కాలంలోనే నాయుడుపేట మండలంలో దాదాపు రూ. కోటికి పైగా నిధులను నకిలీ బిల్లుల రూపంలో ట్రెజరీ నుండి డ్రా చేసుకుని జేబులు నింపుకున్నట్లు సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చేసిన పనులే మళ్లీ చేయడం, ఏళ్లుగా పూర్తయిపోయిన వీధి దీపాల నిర్వహణ, కాలువల పూడికతీత, తాగునీటి పైప్‌లైన్ రిపేర్ల పేరిట రికార్డులు సృష్టించడం. క్షేత్రస్థాయిలో పని జరగకపోయినా, స్పెషల్ ఆఫీసర్ల సంతకాలతో నకిలీ బిల్లులను మంజూరు చేసుకోవడం జరుగుతున్నాయి.

నోటీస్ బోర్డుల్లో లెక్కలు పెట్టాల్సిందే.

అధికారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలంటే గత కొద్ది నెలలుగా జరిగిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ల కాలంలో ఆయా పంచాయతీలకు ఎంత నిధులు వచ్చాయి, ఏ ఏ పనులకు ఎంత ఖర్చు చేశారు, అనే పూర్తి వివరాలను ప్రతి గ్రామ సచివాలయ నోటీస్ బోర్డుపై బహిరంగంగా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద కూడా ఈ వివరాల కాపీలను ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/144

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X