కడప, మహి న్యూస్ అక్టోబర్ 15 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కడపలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (ఎం ఎ ఎన్ యు యు) పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మూడు స్ట్రాంగ్ రూమ్‌లు, మూడు ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి, ఎన్నికల సామగ్రి భద్రత, కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో జేసితో పాటు కడప నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, కడప డీఎస్పీ టి. భవానీ పాల్గొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
Be the first to share your thoughts on this story!