కడప, మహి న్యూస్ అక్టోబర్ 14: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను గురువారం కడప నగరపాలక సంస్థ (కేఎంసి) కమిషనర్ డా. పి. భవానీ ప్రసాద్ రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కడప నగరపాలక పరిధిలో ఏర్పాటు చేసిన పలు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు.
Be the first to share your thoughts on this story!