Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

‘స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా బల్క్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం

Share this Article:
కడప, మహి న్యూస్ జూలై 18: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ‘స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ‘బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ మరియు నమోదు’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో “బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల గుర్తింపు మరియు నమోదు” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో ఉత్పత్తి అయ్యే అధిక వ్యర్థాలను అక్కడికక్కడే తడి, పొడి చెత్తగా వేరు చేసి బాధ్యతాయుతంగా నిర్వహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ కార్యాలయంలోని అన్ని విభాగాలను స్వయంగా సందర్శించి వ్యర్థాల నిర్వహణ తీరును పరిశీలించారు. నూతన నిబంధనల ప్రకారం చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడంతో పాటు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు బాధ్యతతో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ డాక్టర్ ఆరిపుల్లా, నేషనల్ హెల్త్ మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ తాహా, డెమో భారతి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి విజయ భాస్కర్ తదితరులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/19

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X