Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

అనంతపురంలో 'అంబేద్కర్ ఉచిత స్టడీ సెంటర్' ఉచిత హాస్టల్ ఏర్పాటు చేయాలి: రాష్ట్ర అధ్యక్షులు మధు ప్రసాద్ డిమాండ్

Share this Article:
అనంతపురం జులై 18 (మహిన్యూస్ ):

అనంతపురం జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలిచేందుకు తక్షణమే 'అంబేద్కర్ స్టడీ సెంటర్'  ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ప్రసాద్ చేసారు. శనివారం సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. రాజేశ్వరి కి   శనివారం ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో  వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మధు ప్రసాద్ మాట్లాడుతూ... జిల్లాలోని సాయి నగర్ పరిధిలో ఉన్న అంబేద్కర్ భవనం పక్కనే ఖాళీగా ఉన్న ఎస్సీ  హాస్టల్ భవనాన్ని పరిశీలించి, తగిన మరమ్మతులు చేసి అక్కడ స్టడీ సెంటర్‌ను ప్రారంభించాలని కోరారు.
​తిరుపతి, విజయవాడ వంటి నగరాలలో ఉన్న తరహాలోనే అనంతపురంలోనూ అన్ని వసతులతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తక్షణమే నివేదికలు పంపాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన ఎంతోమంది నిరుద్యోగ విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తే  నిరుద్యోగులకు బ్యాంక్, ఎస్ఐ గ్రూప్స్, ఎస్ఎస్‌  ఆర్‌ఆర్‌బీ డీఎస్‌సీ  వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ భవనాన్ని పునరుద్ధరించి, కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మధు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ప్రసాద్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మందల నాగభూషణ అప్ప కమిటీ జిల్లా అధ్యక్షులు మద్దెల చెరువు వెంకీ డిడి రాజేశ్వరి మేడమ్ కు వినతి పత్ర ఇవ్వడం జరిగింది
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/20

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X