ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో సత్తా చాటిన ఎల్లార్తి చంద్రశేఖర్
కడప, జూలై 19 (మహి న్యూస్): దేశవ్యాప్తంగా నిర్వహించిన 21వ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ (ఏఐబిఇ)లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయ విద్యార్థి ఎల్లార్తి చంద్రశేఖర్ అర్హత సాధించి ప్రతిభ చాటుకున్నారు.
ఇటీవల విడుదలైన ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,75,701 మంది ఈ పరీక్షకు హాజరుకాగా, వారిలో 1,15,805 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,595 మంది పరీక్ష రాయగా, 962 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ కఠినమైన పోటీ పరీక్షలో విజయం సాధించడం పట్ల చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భవిష్యత్తులో సమర్థవంతమైన న్యాయవాదిగా రాణిస్తూ, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేయడమే నా లక్ష్యం. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం నా వంతు బాధ్యతగా పోరాడుతాను” అని తెలిపారు.
ఈ విజయంతో ఎల్లార్తి చంద్రశేఖర్‌ను బంధుమిత్రులు, అధ్యాపకులు, సహచర విద్యార్థులు, శ్రేయోభిలాషులు అభినందిస్తూ, ఆయన న్యాయవృత్తిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
0 Comments