గుంటూరు, జూలై 21 (మహి న్యూస్): కోవిడ్ వ్యాప్తిపై జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్–టీచర్స్ సమావేశానికి సంబంధించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందించిన కలెక్టర్, కోవిడ్ విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అక్కడక్కడా నమోదవుతున్న కేసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపారు.
వైద్యశాఖ అధికారులు, వైద్యులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్న ఆయన, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అవసరమైన మందులు, వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ప్రజలకు సూచనలు:
- కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.
- వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలి.
0 Comments