కర్నూలు, మహి న్యూస్ జూలై 25: లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి, అలాగే అధికంగా మద్యం సేవించే వారికి ఆర్కా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత లివర్ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో సాధారణంగా ₹5,000 విలువ చేసే లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరం జూలై 27 (సోమవారం) ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు కర్నూలులోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న ఆర్కా హాస్పిటల్స్ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది.
లివర్ ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకొని అవసరమైన వైద్య సలహాలు పొందేందుకు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
అపాయింట్‌మెంట్ కోసం సంప్రదించవలసిన మొబైల్ నంబర్: 88850 10283
వేదిక: ఆర్కా హాస్పిటల్స్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు.
0 Comments