Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు

Share this Article:

వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు

వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు అవకాశం

కడప, జూలై 25 (మహి న్యూస్): వైఎస్ఆర్ కడప జిల్లాలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటలకు బీమా నమోదు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు.

ఈ పొడిగింపు రుణగ్రహీత (లోనీ), రుణేతర (నాన్-లోనీ) రైతులందరికీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సీఐపీ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న పంటల బీమా నమోదును రైతులు తప్పనిసరిగా జూలై 31లోపు పూర్తి చేయాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత బీమా నమోదు చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

జూలై 31లోపు నమోదు పూర్తి చేసుకున్న రైతులకు ఆగస్టు 1 నుంచి పంట బీమా రక్షణ అమలులోకి వస్తుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం సంభవించినప్పుడు బీమా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.

జిల్లాలోని అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు ముగిసేలోపు పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.

న్యూస్): వైఎస్ఆర్ కడప జిల్లాలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటలకు బీమా నమోదు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు.

ఈ పొడిగింపు రుణగ్రహీత (లోనీ), రుణేతర (నాన్-లోనీ) రైతులందరికీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సీఐపీ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న పంటల బీమా నమోదును రైతులు తప్పనిసరిగా జూలై 31లోపు పూర్తి చేయాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత బీమా నమోదు చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

జూలై 31లోపు నమోదు పూర్తి చేసుకున్న రైతులకు ఆగస్టు 1 నుంచి పంట బీమా రక్షణ అమలులోకి వస్తుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం సంభవించినప్పుడు బీమా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.

జిల్లాలోని అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు ముగిసేలోపు పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/39

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X