Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్.. నేరాలకు స్వస్తి పలకాలని కర్నూలు పోలీసుల హెచ్చరిక

Share this Article:

కర్నూలు, జూలై 26 (మహి న్యూస్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారితో కర్నూలు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

చట్టాన్ని ఉల్లంఘించే కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

కర్నూలు జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/44

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X