ఇంద్రకీలాద్రి/విజయవాడ, మహి న్యూస్, ఆగస్టు 26: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన కార్యాలయ అవసరాల నిమిత్తం ప్రముఖ సంస్థ ‘ఆర్‌వీ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వారు సుమారు రూ. 1,01,000/- (ఒక లక్షా ఒక వెయ్యి రూపాయలు) విలువైన అత్యాధునిక ప్రింటర్ కం జిరాక్స్ మెషిన్‌ను విరాళంగా అందజేశారు.
విజయవాడ నగరంలో ఆర్‌వీ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా, సదరు బ్రాంచ్‌లోని మొట్టమొదటి ప్రొడక్ట్ అయిన ప్రసిద్ధ కోనికా మినోల్టా కంపెనీకి చెందిన జిరాక్స్, ప్రింట్, మరియు కలర్ స్కాన్ సదుపాయాలు కలిగిన అధునాతన మల్టీఫంక్షన్ మెషిన్‌ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామడుగు వెంకట్రావు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) చేతుల మీదుగా దేవస్థానానికి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ.. దేవస్థాన పరిపాలనా విభాగం, భక్తుల సేవా అవసరాల కోసం తమ నూతన వ్యాపార ప్రారంభ మొదటి ఉత్పత్తిని అమ్మవారి సేవకు వినియోగించేలా ముందుకు వచ్చిన దాత కు శ్రీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. అనంతరం దాతలకు శ్రీ అమ్మవారి శేషవస్త్రాలు, అందజేసి వేద ఆశీర్వచనం గావించారు
0 Comments