Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

క్రీడలతో పని ఒత్తిడి తగ్గుతుంది.

Share this Article:

యానాం, మహి న్యూస్, ఆగస్టు 26:  ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు విధుల్లో ఉండే పని ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని యానాం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలను పరిపాలనాధికారి శివరాజ్ మీనా ప్రారంభించారు. ఆర్‌ఏ లెవెన్, ఎస్పీ లెవెన్, ఐఆర్‌బీ లెవెన్ జట్లకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగాయి.
ఆర్‌ఏ లెవెన్, ఐఆర్‌బీ లెవెన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి పరిపాలనాధికారి శివరాజ్ మీనా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సాయి స్పోర్ట్స్ ఇన్‌చార్జి ఉదయ్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/77

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X