Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఘనంగా సేవా కార్యక్రమాలు

పేదలకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ

Share this Article:

ఐ. పోలవరం, మహి న్యూస్, ఆగస్టు 26:  సమసమాజ స్థాపనకు, సమాజంలోని పేదలు, నిరుపేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి దివంగత మదర్ థెరిసా చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని మురమళ్ల ఆటో యూనియన్ అధ్యక్షుడు వీధి శేఖర్‌బాబు అన్నారు. పేదల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మదర్ థెరిసా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తమ సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.

మదర్ థెరిసా 13వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఐ.పోలవరం మండలంలో వీధి శేఖర్‌బాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత మదర్ థెరిసా చిత్రపటానికి శేఖర్‌బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

మదర్ థెరిసా పేరుతో శేఖర్‌బాబు ఏర్పాటు చేసిన సేవా ఫౌండేషన్ ద్వారా వికలాంగులు, వితంతువులు, నిరుపేదలు, ఇతర అణగారిన వర్గాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఉండుర్తి ఈశ్వరీభాయ్ పేర్కొన్నారు.

మురమళ్ల, కొత్తమురమళ్ల, ఐ.పోలవరం, కొమరగిరి, చిన్న కొమరగిరి గ్రామాల్లోని వికలాంగులు, వితంతువులకు, అలాగే మురమళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నిరుపేదలకు రగ్గులు, దుప్పట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పొగాకు రంగా, సవరపు ప్రసాదరావు, మార్తా కిరణ్‌కుమార్, పేరాబత్తుల రాజా, ఆటో యూనియన్ నాయకులు బత్తిన బుజ్జి, వీధి చిరంజీవి, నెయ్యి బాబు తదితరులు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/79

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X