Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి భూపేష్ సుబ్బరామిరెడ్డి కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు

Share this Article:

*కడప జిల్లా/జమ్మలమడుగు మహి న్యూస్, ఆగస్టు 27:*

జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు పెద్దపసుపల మోటు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీచర్స్ కాలనీలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం పార్టీ” కార్యక్రమంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంబాపురం రమణారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మల్లికార్జున, క్లస్టర్ బాల పుల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గురప్ప, గౌస్ పీర్, శంకర్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/82

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X