కర్నూలు, సెప్టెంబర్ 3: మహి న్యూస్ :కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కోసం రోగులు, వారి సహాయకులు భారీ సంఖ్యలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులను సంప్రదించి మందుల చీటీ తీసుకున్న అనంతరం మందులు పొందేందుకు రోగులు మందుల పంపిణీ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు.
ఒకేసారి పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో మందుల కౌంటర్ వద్ద భారీ క్యూ ఏర్పడి, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపించింది. అనారోగ్యంతో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మందుల పంపిణీ కౌంటర్లను పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి, వేగంగా మందులు అందించేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కోసం రోగులు గంటల తరబడి నిరీక్షించకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
0 Comments