Author: admin

రాజంపేట /ఒంటిమిట్ట. మహిన్యూస్. మార్చి 10 : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పవిత్ర పుణ్య క్షేత్రంగా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ రామావతారంలో సీత, లక్ష్మణులతో కలిసి నడయాడిన ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా, చారిత్రాత్మక విశేషాల సమాహారానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం శిల్పకళ వైభవాన్ని స్మరింపజేస్తాయి. ముఖ్యంగా రంగమండపంలోని యాళి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయి. భారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. రాయల వంశ కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండి, అందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. రంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వాటిలో రెండు…

Read More

కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి10: కర్నూలు మార్కెట్ యార్డ్ నందు నెలకొల్పిన చలివేంద్రములను అధ్యక్షులు గోల్కొండ అజ్మత్ బి, ఉపాధ్యక్షులు శేషగిరిశెట్టి మరియు సెలెక్షన్ గ్రేడ్ సెక్రెటరీ జయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వాము, వేరుశనగలు, కందులు, మినుములు లాంటి పంట ఉత్పత్తులు చాలా ఎక్కువగా వస్తున్నాయని ఆ పంటలు తెచ్చే రైతులు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా మినరల్ వాటర్ తో నాలుగు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని శుభ్రమైన మినరల్ వాటర్ ను వినియోగించుకోవాలని రైతులను కార్మికులను వ్యాపారులను కోరారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎ.మారుతి శర్మ, కాశపోగు సువార్తమ్మ, జయశ్రీ యాదవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10: కర్నూలులోని పసుపుల గ్రామ పరిధిలో గల జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో భారత ప్రభుత్వ మైనారిటీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం వికాస్ పథకం కింద మైనారిటీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైనారిటీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫరూక్ తో పాటు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నైపుణ్య శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకుని స్వయం ఉపాధి అవకాశాలు పొందగలరని తెలిపారు.యువత తమ ప్రతిభను పెంపొందించుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జి పుల్లయ్య , కళాశాల ప్రతినిధులు…

Read More

కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10: ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు నాయకత్వం లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం పెంచికలపాడు, గుడిపాడు,గూడూరు, పులకుర్తి, కల్లాపరి మొదలైన గ్రామాల యందు వున్న ఉన్నత పాఠశాల లు మరియు ప్రాథమిక పాఠశాల ల యందు పని చేయుచున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయి నులచే నమోదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు ఆయా పాఠశాల ల ఉపాద్యాయుల యొక్క సమస్య లను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.వారి యొక్క సమస్య ల పై ఉన్నత అధికారులను ఫోన్ యందు సంప్రదించి అప్పటికప్పుడు పరిష్కారం చేయడం జరిగింది.గూడూరు మండలం మరియు కోడుమూరు మండలంలో జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు…

Read More

కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10: కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ గోరంట్ల లక్ష్మి మాధవస్వామి తిరుణాల మహోత్సవం వేడుకల్లో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.భక్తులందరికీ ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తూ గోరంట్ల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి మాధవస్వామి రథమును దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ముఖ్యంగా మంగళవారం సాయంకాలం జరిగే శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి మాధవ స్వామి రథోత్సవ కార్యక్రమం ఎలాంటి అవాంచచనీయ ఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆలయ కమిటీ వారికీ, ఉత్సవ కమిటీకి,పోలీస్ సిబ్బందికి,అధికారులకు ఆదేశాలివ్వడమైనది. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక…

Read More

చిత్తూరు జిల్లా/బంగారుపాళ్యం, మహి న్యూస్, మార్చి 10 : చిత్తూరు జిల్లా,బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని చూపించి విద్యార్థులకు పోలీస్ స్టేషన్ యొక్క గొప్పతనాన్ని వివరించారు. పోలీసులు యొక్క విధివిధానాలను చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు.పోలీసులంటే అహర్నిశలు ప్రజల కోసం ధన,మాన,ప్రాణాలను కాపాడే వ్యక్తులని వివరించారు. పోలీసులంటే ఒకరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ ప్రసాద్,విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ ఆర్.ఎన్. జ్యోతినాథ్,ఇంచార్జ్ హిమగిరి, డైరెక్టర్ రవితేజ, ఉపాధ్యాయులు బేబీరాణి, ఉష,లిఖిత తదితరులు పాల్గొన్నారు.

Read More

ఒంటిమిట్ట/తిరుమల,మహి న్యూస్, మార్చి 10 : కడప జిల్లాలోని పవిత్ర క్షేత్రం ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం శిల్పకళ వైభవాన్ని స్మరింపజేస్తాయి. ముఖ్యంగా రంగమండపంలోని యాళి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయి. భారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. రాయల వంశ కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండి, అందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. రంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వాటిలో రెండు స్తంభాలు సంప్రదాయ పేట్రస్ శైలిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడి ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చరిత్ర పురాణాల ప్రకారం త్రేతాయుగంలో…

Read More

తిరుమల, మహి న్యూస్, మార్చి 10 : తిరుమల శ్రీవారి ఆలయంలోని పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందని ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యం. వాస్తవాలను వక్రీకరించి రాసిన ఈ క‌థ‌నాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవానికి, 2025 జనవరి 11న పరాకామణిలో విధులు నిర్వహిస్తున్న ABREPOSE సంస్థ‌కు చెందిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య అనే వ్యక్తి 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించినప్పుడు టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఆ బంగారు బిస్కెట్‌ను ఖాళీగా ఉన్న స్టీల్ హుండీ ట్రాలీలోని పైపు రంధ్రంలో దాచిపెట్టినట్లు సాధార‌ణ‌ భద్రతా తనిఖీలలో గుర్తించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. దాని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించబ‌డ్డాయి. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీస్…

Read More

చిత్తూరు జిల్లా/బంగారుపాలెం, మహి న్యూస్, మార్చి 10 : చిత్తూరు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా బంగారుపాళ్యం సబ్ – రిజిస్టర్ ఎం యోగానంద్ సోమవారం ఏకగ్రీవంగా నియమితులైనారు. సీనియర్ అసిస్టెంట్ విజయ్ కోశాధికారి గా నియమితులైన శుభ సందర్బంగా బంగారు పాళ్యం డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుస్సా నాగరాజ గౌడ్ ఆధ్వర్యంలో బంగారు పాళ్యం సబ్ -రిజిస్టార్ కార్యాలయం లో మంగళవారం ఘనంగా పుష్పగుచ్చం అందచేసి శాలువాలు కప్పి సన్మానించడమైనది. ఈకార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పద్మనాభ పిళ్లై,ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ లాల్, కార్యదర్శి సురేష్, కోశాధికారి సుజాత , సభ్యులు ప్రసాద్,రాజా,చిన్నమ్మ, శివ, స్టాంప్ వెండర్స్ దినేష్, అభిరామ్, ఈశ్వర్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Read More

కర్నూలు మహి న్యూస్ మార్చి 03: రిటైర్డ్ అవుతున్నందుకు బాధ లేదు గాని ఒక పెద్ద బ్రాండ్ విజయ మిల్క్ కేంద్రం నుంచి బయటకు వస్తున్నందుకు బాధగా ఉందని కర్నూలు మిల్క్ యూనియన్ అధికారి డిప్యూటీ డైరెక్టర్ డి.ఎం.వలి పేర్కొన్నారు. కర్నూలు పట్టణంలోని విజయ పాల డైరీ పరిపాలన భవనంలో మేనేజర్ వివేకానంద సమక్షంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డిఎం వలి ను శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మేనేజర్ మాట్లాడుతూ డిఎం వలి చేసిన సేవలను కొనియాడారు. క్రమశిక్షణతో, స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందారన్నారు. ఈ కార్యక్రమంలో వలి సతీమణి ఖుర్షీద్, ఏజెంట్లు రవీంద్ర, సుంకన్న, వెంకటస్వామి, శ్రీను, సిబ్బంది నరసింహారెడ్డి, అనంత్, రంగారావు, శేఖర్, శోభ, స్వాతి, రాజేష్, రాజు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read More