Author: admin

కోట‌బొమ్మాళి, మహి న్యూస్, జనవరి 17 : నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కే రైల్వే హాల్టుల కోసం కృషి చేయ‌డం జ‌రిగింద‌ని, ఇందులో భాగంగానే సుదీర్ఘ కాలంగా నిరీక్ష‌ణ‌లో ఉన్న సమస్యను కొలిక్కి తీసుకు వ‌చ్చే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కేంద్ర‌మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు సంప్రదింపులు చేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అభినందనీయమని, ఇందులో భాగంగా బ్ర‌హ్మ‌పురం నుంచి విశాఖ ఎక్స్ ప్రెస్ స‌ర్వీస్ కు తిలారు వ‌ద్ద నూత‌న హాల్టు సాధించామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు. తిలారు రైల్వే స్టేష‌న్ వ‌ద్ద బ్ర‌హ్మ‌పురం నుంచి విశాఖ ఎక్స్ ప్రెస్ స‌ర్వీస్ కు తిలారు వ‌ద్ద నూతన హాల్టును కేంద్ర‌మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుతో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..1996లో దివంగ‌త నేత, అప్ప‌టి కేంద్ర మంత్రివర్యులు దివంగత కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు ఈ…

Read More

మహి న్యూస్ చీరాల జనవరి 3. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన పట్టాభి రాజేష్ కుమార్తె పట్టాభి సంయుక్త స్కూలుకి వెళ్లకుండా పారిపోయి ఎటు వెళ్లాలో తెలియని గందరగోళ స్థితిలో వేటపాలెం కు చెందిన కార్పెంటర్ ఎన్.భగవాన్ రెడ్డికి నిస్సహాయ స్థితిలో కనిపించింది. తప్పిపోయిన బాలికను ఇంటికి చేర్చడానికి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా బాలిక సరైన సమాధానాలు చెప్పకపోవడంతో చీరాల ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించడం జరిగింది. బాలిక తప్పిపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాప తల్లిదండ్రులు సమాచారం తెలుసుకొని చీరాల వన్ టౌన్ సిఐ ఎస్ సుబ్బారావుని సంప్రదించగా విచారించిన అనంతరం పాప తండ్రిని గుర్తించి పట్టాభి సంయుక్తను అతనికి అప్పగించడం జరిగింది.

Read More

రాజోలు,మహి న్యూస్, డిసెంబర్ 31 : పెనియల్ ప్రేయర్ హౌస్ చర్చి నందు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, పాస్టర్ శరత్ భూషణం స్వయంగా సమకూర్చిన కుట్టు మిషన్లు, బట్టలను కొంతమంది నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. జీవనోపాధి కల్పించే ఈ సేవా కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ తో కలిసి టిడిపి నాయకురాలు గొల్లపూడి అమూల్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యాజీ వేమ, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, గుబ్బల శ్రీనివాస్, కడలి శ్రీ దుర్గ, సర్పంచ్ కోటిపల్లి రత్నమాల, గుండెబోగుల బాబి,సూరిశెట్టి, స్వామి నాయుడు, వై కె రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా భావనతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికీ అమూల్య హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మన రాజోలు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు జరగటం సంతోషకరమని అన్నారు. సహాయం అందించిన పాస్టర్…

Read More

రాజోలు, మహి న్యూస్, డిసెంబర్ 31: మలికిపురం మండలం, శంకరగుప్తం డ్రెయిన్ పూడిక తీత మరియు గట్ల నిర్మాణం పనులను మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ వర్చువల్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్, టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్ గుప్తం చుట్టుపక్కల కొబ్బరి రైతులకు ఈ పనులతో ముంపు నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఉపముఖ్యమంత్రి చొరవతో త్వరితగతిన డ్రేయిన్ పూడికతీత పనులకు అవకాశం కలిగిందని కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కోనసీమ రైతులకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు ముందు ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్మహేష్ కుమార్,జాయింట్ కలెక్టర్ ,డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, జిల్లా అధికారులు, శంకరగుప్తం గ్రామ సర్పంచ్ రాపాక ఆనంద్ కుమార్, మలికిపురం మండలం ఎంపీపీ నాగమణి, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ద్రాక్షారామం(మహి న్యూస్) డిసెంబర్ 31: ద్రాక్షరామం గుడిలో శివలింగాన్ని ధ్వంసం చేసిన శీలం శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ బుధవారం అతని ఇంటి వద్ద ద్రాక్షారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది శ్రీనివాస్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మోటర్ బైక్ నేరమునకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం రెమండపం పంపించడం జరిగిందన్నారు.శ్రీనివాస్ద్రాక్షారామ గ్రామంలో గల లిటిల్ రోజ్ కాలేజీ నందు డిగ్రీ (B.Com) వరకు చదువుకుని, ప్రస్తుతం ఇనుప సామానుల పని చేసుకుంటూ జీవిస్తున్నట్లు, అతనికి శివుని పై విపరీతమైన భక్తి ఉండుట వలన తన కుడి భుజం వద్ద శివలింగంను పచ్చ బొట్టుగాను, తన యొక్క జన్మ నక్షత్రం…

Read More

తాళ్లరేవు, మహి న్యూస్, డిసెంబర్ 31. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న వెయ్యి లీటర్ల డీజిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కోరంగి ఎస్ఐ పి. సత్యన్నారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గొల్లప్రోలు గ్రామానికి చెందిన వెన్న శ్రీను, కర్రి అశోక్ యానాంలోని ఒక పెట్రోలు బంకులో వెయ్యి లీటర్ల డీజిల్ను పీపాల్లో నింపుకుని వ్యానుపై తరలిస్తుండగా. పి.మల్లవరం చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకపోవడంతో డీజిల్ తోపాటు టాటావ్యానును స్వాధీనం చేసుకుని సీజ్ చేసారు. ఎవరైనా యానాం నుంచి పెట్రోల్, డీజిల్ను అక్రమంగా తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ సత్యన్నారాయణ తెలిపారు. ఈ దాడిలో కోరంగి పోలీసులు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు ముమ్మిడివరం (మహి న్యూస్) డిసెంబరు 31 నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ సందర్భంగా యువత క్రీడల పై మొగ్గు చూపి వ్యసనాలకు దూరంగా ఉండాలని ముమ్మిడివరం సిఐ ఎం.మోహన్ కుమార్, ఎస్. ఐ డి.జ్వాలాసాగర్ లు పేర్కొన్నారు. ముమ్మిడివరం పురవీధులలో బుధవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

చిత్తూరు జిల్లా/ కాణిపాకం డిసెంబర్ 31. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం ఐరాల మండలం కాణిపాకం లో నూతన సంవత్సరం2026 జనవరి 1న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఇబ్బందుల్లేని, సంతృప్తికర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రసాద వితరణ, లడ్డు కౌంటర్లు, ఆన్‌లైన్ టికెట్ కౌంటర్లను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు శీతల పానీయాలు అందించడంతో పాటు, చిన్నపిల్లల తల్లులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే మరింత సులభమైన దర్శనం లభిస్తుందని సూచించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థాన చైర్మన్ మణి నాయుడు, బోర్డు సభ్యులు, అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు…

Read More

చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం డిసెంబర్ 31. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆనందంగా, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని జెట్ న్యూస్ తరపున ఎస్ఐ ప్రసాద్ కోరారు. ముఖ్యంగా యువత త్రాగి డ్రైవింగ్ చేయడం, బైక్ రేస్లు, యాక్సిడెంట్లు చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే విధంగా చేయడం రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేసి కేక్ లు కట్ చేయడం, నూతన సంవత్సర సందర్భంగా మీ ఇళ్లలో మీరు కేక్ లు కట్ చేసుకుని పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్ఐ టి. ప్రసాద్ తెలిపారు.

Read More

అక్రమ మద్యాన్ని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ చెకోపోస్టులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. తాళ్లరేవు మండల సరిహద్దులో ఉన్న కేంద్రపాలితప్రాంతమైన యానాం నుంచి మద్యం ఆంధ్రాప్రాంతానికి అక్రమ తరలింపును నియంత్రించేందుకు సరిహద్దు ప్రాంతాలైన నీలపల్లి, సుంకరపాలెం గ్రామాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసారు. నీలపల్లి ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా చెక్పోస్టు ఉండి మంచి పేరుగాంచింది. యానాం నుంచి నీలపల్లి దాటాలంటే అక్రమార్కులు భయబ్రాంతులకు గురయ్యేవారు. అటువంటి పేరుగాంచిన చెక్పోస్టు నేడు అధ్వానంగా తయారైంది. మండలంలో జాతీయ రహదారి216 చెంతన పి.మల్లవరం వద్ద చెకోపోస్టును ఏర్పాటు చేసారు. దీంతో నీలపల్లి చెక్ పోస్ట్ నిరుపయోగంగా మారింది. అయితే ఈ చెక్ పోస్టులో నిర్వహణ లేకపోవడంతో ప్రాంగణంలో చెత్త చెదారాలు వేయడంతో ఆధ్వానంగా దర్శనమిస్తుంది. అదేవిధంగా సుంకరపాలెంలో చెక్పోస్టు ఉన్నప్పటికీ నిరంతర తనిఖీలుగాని, మద్యం ఆక్రమార్కులను పట్టుకోవడం గాని కానరావడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఉండగా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ సైతం అలంకారప్రాయంగా మారింది. పట్టుమని…

Read More