Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

బీజేపీ జాతీయ సెల్స్ సహ సమన్వయకర్తగా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి

Share this Article:

ఢిల్లీ, మహి న్యూస్, ఆగస్టు 26:  బీజేపీ జాతీయ సెల్స్ సహ సమన్వయకర్తగా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో నూతన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అన్ని సెల్స్ విభాగాల సమన్వయకర్త, మధ్యప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు విష్ణుదత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, మాజీ పార్లమెంట్ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాష్ రెడ్డి, ఇతర పార్టీ ప్రముఖులు, కేంద్ర పార్టీ కార్యాలయ సిబ్బంది పాల్గొని విష్ణువర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ వివిధ సెల్స్ విభాగాల పనితీరును మరింత విస్తృతం చేయడంతో పాటు, భవిష్యత్ పార్టీ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుంటానని తెలిపారు.

పార్టీ అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి అన్ని సెల్ విభాగాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల్లో పార్టీ సెల్ విభాగాలను కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కీలక సెల్ విభాగాలను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/81

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X