వికారాబాద్ జిల్లా పరిగి (మహి న్యూస్):
పరిగి మునిసిపాలిటీ లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటర్లకు ఇప్పటికే జారీ చేసిన నోటీసులు, ఇంకా జారీ చేయాల్సిన నోటీసుల వివరాలను కలెక్టర్ బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు ఏయే ఓటర్లకు జారీ చేశారు, ఎన్ని నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి, జారీ చేసిన నోటీసులపై తదుపరి చేపట్టాల్సిన చర్యలు ఏమిటనే అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బిఎల్ఓ లకు సూచించారు. జారీ చేసిన నోటీసుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, పెండింగ్‌లో ఉన్న నోటీసులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆర్టీవోకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర,, ఎంపీడీవో హరిప్రియ , ఎలక్షన్ డీ టీ అనిల్ కుమార్, మున్సిపల్ ఆర్ ఐ రామకృష్ణారెడ్డి,. బి ఎల్ వోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!