Author: admin

కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 25 : కుటుంబ సరాసరి ఆదాయ వనరులను పెంచే ప్రణాళికలు రూపొందించటానికి జాతీయ గృహ ఆదాయ సర్వేలు ఎంతగానో ఉపయోగపడుతాయని, తద్వారా అత్యుత్తమ భారత సమాజ స్థాపన సాధ్యం అవుతుందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ .ఎస్ .ఒ ) జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ పేర్కొన్నారు. బుధవారం కడపలోని ఆర్.ఎస్ .ఆర్ స్క్వేర్ మాల్ లో గణాంక సర్వే నిర్వహణపై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ .ఎస్ .ఒ ) -ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ (ఎఫ్ ఓ డి ) కడప ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రాంతీయ శిక్షణా శిబిరం (ఆర్టీసీ)కు జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న జాతీయ గృహ ఆదాయ సర్వేలో భాగంగా, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే…

Read More

విజయనగరం, మహి న్యూస్, ఫిబ్రవరి 25: టిడ్కో ఇళ్లలబ్ధిదారులకు న్యాయం చెయ్యాలని బుధవారం బాలాజీ సెంటర్ లోని ప్రజా గ్రంధాలయంలో బాధితులు విలేకరుల ముందు తమ గోడు వెళ్ళబుచ్చారు.ఈ కార్యక్రమం లో ప్రజా విజయం పార్టీ అధ్యక్షులు పి. షణ్ముఖ రావు, టివి దుర్గారావు, లక్కవరపు కోట ఆదినారాయణ, సోమేశ్, ఇ.ఎస్.ఎన్ రాజు, జీ.సింహాచలం, ఎల్.లిపిక లు బాధితులకు అండగ నిలిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూవిజయనగరం పట్టణంలో అద్దె ఇళ్లల్లో వున్న వారికి ప్రభుత్వం టిడ్కో ఇళ్లు మంజూరు చేసిందని, కాని అక్కడ కనీస సౌకర్యాలు లేని కారణంగా ఆ ఇళ్లల్లో చేరడానికి ఇష్టపడడం లేదన్నారు. ప్రభుత్వం అక్కడ కనీస సౌకర్యాలైన తాగునీరు,రోడ్డు, మార్కెట్, విద్య, వైద్యం లాంటివి ఏర్పాటు చేయాలని కోరారు.అక్కడ సౌకర్యాలు లేని కారణంగా లబ్ధిదారులు ఇళ్లలో చేరడానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.అయితే బ్యాంకు వారు డబ్బులు కట్టని పక్షంలో ఈ నెల 27వ తేదిన…

Read More

చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసియుండు శ్రీ మొగిలీశ్వరస్వామి దేవస్థానమునకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం(పరాకామణి) బుధవారం చిత్తూరు దేవదాయశాఖ తనిఖిదారు యస్.శ్వేత పర్యవేక్షణలో, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త యమ్.బి.విజయకుమార్, కార్యనిర్వహణాధికారి ఎ.మునిరాజ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. 86 రోజులకు గాను దేవస్థానం హుండీలు ద్వారా రూ 7,96,688.00లు , అన్నదానము హుండీలు ద్వారా రూ 84,597.00 రావడం జరిగినది. భక్తులు హుండీలో సమర్పించిన బంగారం 18 గ్రాముల 20 మిల్లిగ్రాము, వెండి 92 గ్రాముల 400 మిల్లిగ్రాము వచ్చినది. ఈ కార్యక్రమంలో ఈవో మునిరాజులు, ఇన్చార్జి శరవణ, గ్రామస్తులు మంజునాథ్ నాయుడు,ప్రసాద్ నాయుడు , సోమశేఖర్ నాయుడు,బంగారుపాళ్యం హెడ్ కానిస్టేబుల్ వినాయకం, ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, బాలాజీ, పాల్గొనడం జరిగినది.

Read More

నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:- రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ, నగదు రహిత వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా రవాణాశాఖ అధికారి, మునిసిపల్ కమిషనర్లు, రోడ్లు మరియు భవనాలు శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి 7 రోజుల్లో ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించబడుతుందని కలెక్టర్ తెలిపారు. పోలీసుల ధృవీకరణ అనంతరం సాధారణ గాయాల కేసుల్లో 24 గంటల పాటు, తీవ్ర గాయాల కేసుల్లో 48 గంటల పాటు స్థిరీకరణ వైద్య సేవలు అందించబడతాయని వివరించారు.…

Read More

గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి ఇసుక దోపిడీ చేశారు మార్కాపురం, మహి న్యూస్, ఫిబ్రవరి 25: పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసగించారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. పనులు పూర్తిచేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. రైతుల ఆశలను వమ్ము చేస్తూ ప్రాజెక్టును రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ధ్వంసం చేసి, భారీ ఎత్తున ఇసుక దోపిడీ చేశారని అన్నారు. ప్రజా సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం దానినే దోచుకుందన్నది దురదృష్టకరమన్నారు. ఇలా జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలో బుధ‌వారం నాడు సీఎం చంద్ర‌బాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌జా వేదిక బహిరంగ స‌భ‌లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ……

Read More

కర్నూలు, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : శనగ పంటను పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటా కు రూ.5,875 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు. మంగళవారం ఆలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శనగ మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియ, తూకం, రికార్డుల నిర్వహణ, రైతుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్…శనగ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 252 మంది రైతులు శనగ అమ్మకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు వెంటనే నమోదు చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర ప్రయోజనం పొందాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. దళారులను నమ్మి తక్కువ…

Read More

ఆస్పత్రులు, ఇంటింటికీ వెళ్లి బాధితులకు ధైర్యం శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : శ్రీకాకుళం నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బుధవారం ఉదయం విస్తృత పర్యటన చేపట్టారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దమ్మలవీధిలోని సిమ్మన హాస్పిటల్, మంగువారి తోట ప్రాంతం, అలాగే రిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క రోగి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, ఎవరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని…

Read More

శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25: డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జెమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన సందర్శించారు. వీరిని కలెక్టర్ స్వయంగా వెళ్లి వారికి అందిస్తున్న వైద్యం గూర్చి వైద్యులతో చర్చించారు. పేషెంట్స్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా కల్పించారు. అన్ని హాస్పిటల్స్ ల్లో చికిత్స తీసుకుంటున్న వారిలో బుధవారం 13 మందిని డిస్చార్జ్ చేశారు. కలెక్టర్ తో పాటు జెమ్స్ వైద్యులు డాక్టర్ హేమంత్, ఆర్ఎంఓ ప్రవీణ్, తదితర వైద్యులు పాల్గొన్నారు.

Read More

అమరావతి, మహి న్యూస్, ఫిబ్ర‌వ‌రి 25: శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)ను బహుళార్థ సాధక సౌకర్య కేంద్రాలు (ఎంపీఎఫ్సీ)లుగా అభివృద్ధి చేసే కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమగ్రంగా సమాధానం ఇచ్చారు. జూన్ 2020లో కేంద్ర ప్రభుత్వ అగ్రీకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఏఐఎఫ్) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రైతు భరోసా కేంద్రం (ఆర్ఎస్కే) స్థాయిలో నిల్వ మరియు ఆరబెట్టే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. విశాఖపట్నం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా గోడౌన్లు మరియు డ్రైయింగ్ యార్డుల నిర్మాణం జరుగుతోందని, మొత్తం రూ.504.42 కోట్ల వ్యయంతో ఈ పథకం అమలవుతోందని పేర్కొన్నారు. నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ సదుపాయం కల్పించబడుతుందని, పీఏసీఎస్లకు 4% వడ్డీపై 3% వడ్డీ రాయితీ లభిస్తుందని, 90% రుణం మరియు 10% మార్జిన్…

Read More

శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25: నగరంలో డయేరియా లక్షణాలతో ఎవరైనా బాధపడుచున్న యెడల వెంటనే నగరంలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుమతి ఉన్న అన్ని హాస్పిటల్స్ లలో డయేరియా పేషెంట్స్ కు ఉచిత వైద్యం అందించబడుతుందని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అవని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రీకాకుళం పట్టణంలో ఎవరికైనా డయేరియా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే తక్షణమే నెట్వర్క్ హాస్పిటల్ కు వెళ్లి ఉచిత వైద్యం పొందాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యం కొరకు ఎలాంటి సహాయం కావాలన్నా దిగువ ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. టీం లీడర్ 1.:9281068255టీం లీడర్ 2: 9281068256టీం లీడర్ 3: 9281068257జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ అవని : 9281068139

Read More