Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: admin
తెలంగాణ( రంగారెడ్డి జిల్లా) మహి న్యూస్, ఫిబ్రవరి 07: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు, పటాన్‌చేరు ఇన్‌చార్జ్ యడమ రాజేష్, సీనియర్ నాయకులు సైదాల శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అడక్ కమిటీ సభ్యులు పవన్, జైరాం,రాష్ట్ర విద్యార్థి నాయకులు సూర్య, వంశీ ప్రసాద్, సునీంద్రబాబు, గబ్బర్ సింగ్ టీమ్‌తో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జనసేనపై తమ విశ్వాసాన్ని చాటారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ –“తాండూర్ ప్రజల సమస్యలు నిజాయితీగా పరిష్కరించేందుకు ముందుకు వచ్చే నాయకత్వమే ఇప్పటి అవసరం. మురుగు కాల్వలు, తాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి, నిరుద్యోగ యువత భవిష్యత్తు – ఇవన్నీ ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చే విషయాలుగా కాకుండా,…
*కడప, మహి న్యూస్ జనవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే పనులను.. జిల్లాలో ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్ఏ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి.. భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీ లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితో పాటు.. జేసీ నిధి మీనా హాజరయ్యారు.సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి విసి ముగిసిన అనంతరం.. జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో విసి ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి వారి…
ఒంటి కొండ వద్ద స్కూల్ బస్సు బోల్తా అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా? మహి న్యూస్ .కే.పల్లి శ్రీ సత్య సాయి జిల్లా జనవరి 31: శ్రీ సత్య సాయి జిల్లాలో మరో మారు విద్యాసంస్థల బస్సుల భద్రత ప్రశ్నార్థకమైంది. శనివారం ఉదయం సికేపల్లి మండలం ఒంటికొండ సమీపంలో ధర్మవరం లో నిర్వహిస్తున్న వంశీకృష్ణ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సు బోల్తా పడటం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తు విద్యార్థులు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఈ ప్రమాదం రవాణా శాఖ పనితీరుపై అనేక విమర్శలకు దారితీస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్. ఐ సత్యనారాయణ హుటాహుటి న ప్రమాద స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నారు. పలువురు గ్రామస్తులు మరొక విద్యా సంస్థ అయినా కృషి విద్యాలయ బస్సు కూడా అతివేగంతో వెళుతుందని వేగాన్ని కట్టడి చేయాలని పోలీసులకు తెలిపారు
కడప జిల్లా/జమ్మలమడుగు, మహి న్యూస్, జనవరి 30 : 2018- 19 లో ఎస్సి కార్పొరేషన్ ద్వారా వాహనాలు తీసుకున్న లబ్ధిదారులు ఎస్సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జి. రాజ్యలక్ష్మీ ని కలిసి ఉపాధి మార్గం చూపించాలని శుక్రవారం ఉదయం కోరారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ 2018-19 గత టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నందు ఎన్.ఎస్.ఎఫ్.డి సి లో ఇన్నోవా క్రిష్ట కార్లు మాకు మంజూరు అయ్యాయి అన్నారు. 2019 లో ప్రభుత్వం మారడం మమ్మల్ని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నందు లబ్ధిదారులైన మమ్ములను టిడిపి కి అనుకూలమైన లబ్ధిదారులుగా గుర్తించి మాకు ప్రభుత్వ కార్యాలయాలు,ఇతర ప్రభుత్వ అనుసంధారేతర ప్రైవేట్ కంపెనీ లలో నెలసరి బాడిగల కు ఏర్పాటు చేకూర్చకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఇప్పటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బహిరంగ టాక్సీ స్టాండ్ లలో రోజువారి బాడిగలు…
ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఏలూరు, మహి న్యూస్, జనవరి 30 : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. స్థానిక చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ ఫంక్షన్ హాలులో శుక్రవారం రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో తీసుకోవలసిన మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కలిగించడమే రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రైతుల ప్రతీ…
కడప, మహి న్యూస్ జనవరి 29 : సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉంది. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆలోచన ప్రశంసనీయం, దేశానికే ఆదర్శనీయం అని.. కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డా. వి. వినోద్ కుమార్ లు అభినదించారు. రాష్ట్రానికే ఆదర్శవంతంగా జిల్లాలో అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురువారం జిల్లాకు వచ్చిన కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డా. వి. వినోద్ కుమార్ లు.. స్థానిక కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ** సమావేశంలో వారు మాట్లాడుతూ.. సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉందని, జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్…
నంద్యాల జిల్లా/ నంద్యాల మహి న్యూస్ జనవరి 27 భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాదం తిరుపతి గారు హాజరు అయ్యారు రాష్ట్ర కమిటీ సమావేశం స్థానిక సునీత వొకేషనల్ కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం *వికసిత భారత్ శిక్షా అధిష్టాన్* చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ఆయన అన్నారు దేశంలో వైద్య, న్యాయవిద్య మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే కుట్ర చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దీనివలన విద్య అనేక మందికి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు దేశ ప్రజానీకం కలిసికట్టుగా వ్యతిరేకించాలని కోరారు. ఈ అధిష్టాన్ విధానం వల్ల…
చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం జనవరి 27.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఎలెక్ట్రిషియన్ యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రభుత్వ కాలేజి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సుమారు వందమందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య శాఖ అధికారి డాక్టర్ శిరీష, హెడ్ నర్స్ సుమతి బాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లంబర్ & ఎలక్ట్రిషన్ వారు మాట్లాడుతూ, థామస్ అల్వా ఎడిషన్ బల్బ్ కనిపెట్టిన రోజును మేము ఎలెక్ట్రిషియన్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా నాలుగువేల మంది ఎలక్ట్రిషన్లు ఉన్నామని మా ఎలెక్ట్రిషియన్ ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు.అలాగే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సర్వీసు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. గతం…
మహి న్యూస్ జనవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే పనులను.. జిల్లాలో ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్ఏ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి.. భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీ లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితో పాటు.. జేసీ నిధి మీనా హాజరయ్యారు.సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి విసి ముగిసిన అనంతరం.. జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో విసి ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి వారి సూచనల…
కర్నూలు, మహి న్యూస్, జనవరి 17:-జిల్లాలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణ వ్యవసాయ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులను ఆదేశించారు.. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ క్రాప్ బుకింగ్, రైతు సేవా కేంద్రాల యాక్షన్ ప్రణాళిక తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో, మండల వ్యవసాయ శాఖ అధికారులతో, రైతు సేవ కేంద్రం అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఉల్లి, పత్తి పంటల సేకరణలో ఎదురైన సాంకేతిక మరియు ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే కందులు, శనగలు, మిర్చి పంటల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు… పంట సేకరణ ప్రక్రియలో రైతులు ఇబ్బంది పడకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడడమే తన…
