Author: admin

అమలాపురం, మహి న్యూస్, ఫిబ్రవరి 26: అమరావతి నుండి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ భాషా లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 ఏళ్లు నుండి 59 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు చదవడం, రాయడం, లెక్కలు నేర్పించడం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూమహిళలు, గ్రామీణ ప్రజలు, వెనుకబడిన వర్గాలకు డిజిటల్ అక్షరాస్యత కల్పిస్తున్నారు.జిల్లాలో 5,340 మంది వాలంటీర్లు 53,092 మంది వయోజనులకు ఆన్‌లైన్ ద్వారా బోధన చేస్తున్నారు.సామాజిక అవగాహన, ఆరోగ్యం, ఆర్థిక సాక్షరత పెంపొందించడంపై దృష్టి పెట్టాం అన్నారు.గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు.సులభమైన పాఠ్యపుస్తకాలు, ప్రాథమిక గణితం, దైనందిన జీవితానికి ఉపయోగపడే విషయాల బోధన.బ్యాంకింగ్, డిజిటల్ సేవలు వినియోగించే సామర్థ్యం పెంపు.ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.2029 నాటికి రాష్ట్రాన్ని 100 శాతం అక్షరాస్యత రాష్ట్రంగా మార్చడం అనే లక్ష్యంతోఫౌండేషన్ లిటరసీ…

Read More

రాజోలు, మహి న్యూస్, ఫిబ్రవరి 26: మలికిపురం గ్రామంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద, లక్కవరం గ్రామంలో లక్కవరం సెంటర్ నందు, రాజోలు గ్రామంలో సంత మార్కెట్ వలువలమ్మ గుడి వద్ద జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఉద్యమిని పార్టీ భాగస్వామ్యం చేయడమే సాధాక్ లు ముందు ఉన్న బాధ్యత అని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారందరిని గుర్తించి వారికి సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు.నియోజవర్గ వ్యాప్తంగా సాధక్ లు అందరికి సభ్యత్వ నమోదు లింక్ ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి గతానికి మించి సభ్యత్వ నమోదు చేసి నియోజకవర్గాన్ని ముందు స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. జనసేన నాయకత్వం అంతా సాధక్ లకు అండగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

కర్నూలు, మహి న్యూస్, ఫిబ్రవరి 26: కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని పాత ఈద్గా వద్ద హ్యాపీ మొబైల్స్ రెండో బ్రాంచ్ ని నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ముందుగా షో రూమ్ వద్ద నుండి బయలుదేరిన హ్యాపీ మొబైల్స్ ప్రచార బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ రాజవిహార్ మీదుగా పాత బస్టాండ్ కొండారెడ్డి బురుజు నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా షోరూం మేనేజర్ శ్రీకాంత్, రామకృష్ణ మాట్లాడుతూ నేటి తరానికి, యువత కు మెచ్చే అద్భుత మయిన ఫీచర్లుగల మొబైల్స్ అందుబాటు ధర లో ఉన్నాయని, క్రెడిట్ కార్డులు, మరియు ఈఎంఐ ఫెసిలిటీ తోపాటు ,తగ్గింపు ధరలతో, మొబైల్ పై గిఫ్ట్ లతో అనేక సదుపాయాలు ఉన్నాయని వినియోగదారులు వినియోగించుకోవలసిందిగా వివరించారు. ముఖ్యంగా హ్యాపీ మొబైల్స్ లో మొబైల్ అమ్మకాలతో పాటు గృహ ఉపకరణాల ను కూడా అతి తక్కువ ధరలో అందిస్తున్నామని, సోలార్ పవర్ ను ప్రభుత్వ…

Read More

చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 26 : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని నేషనల్ హైవే పక్కన ఉన్న డాబాలలో సీఐ కత్తి శ్రీనివాసులు వారి సిబ్బందితో గురువారం తనిఖీ చేయడం జరిగింది. డాబాలలో లిక్కర్ వంటి మత్తు పదార్థాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా నిర్వహిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని డాబా యజమానులకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు తెలియజేశారు. డాబాల దగ్గర యజమానులు సీసీ కెమెరాలు అమర్చాలని తెలియజేశారు. ఎటువంటి గొడవలు డాబాల దగ్గర జరిగిన గొడవలు పడిన వారిపై, డాబా యజమానులపై కేసులు తప్పకుండా ఉంటాయని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐ తో పాటు కానిస్టేబుల్స్ అస్గర్, ధరణి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Read More

యానం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అందించిన వందల కోట్ల నిధులతో నిర్మించిన జిప్మ్ ర్ బ్రాంచ్ ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యానం పరిసర ప్రాంత ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా వినియోగించుకోవచ్చని బుధవారం ఉదయం జరిగిన సమావేశంలో మల్లాడి కృష్ణారావు అన్నారు. స్థానిక జిప్మెర్ ఆస్పత్రిలో మరిన్ని ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిలో అందిస్తున్న అన్ని రకాల సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ప్రతి ఇన్ పేషెంట్ ని పలకరించి వారికి అందిస్తున్న వైద్య సేవలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడి వారు ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు అనంతరం డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లు అందరికీ అందుబాటులో లేని మందలను ఆయన కొని అందించారు. అదేవిధంగా వైద్యులకు రోగులకు స్వీట్లు…

Read More

సాంకేతికత వినియోగం భేష్.క్రీడా ప్రాంగణాల ఏర్పాటు విద్యార్థులకు వరం. విద్యా ప్రమాణాల విషయంలో టీచర్ల కృషి అభినందనీయం.సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు పిలుపు. చిత్తూరు జిల్లా /బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : చిత్తూరు జిల్లా,బంగారుపాళ్యం మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడేలా నిర్వహించబడుతోందని , కేంద్ర ప్రభుత్వ అధికారి మనీష్ అన్షు ప్రశంసించారు. జిల్లాలో పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల స్థితిగతులను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలకులుగా విచ్చేసిన మనీష్ అన్షు గారు, తన పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్లు స్కౌట్ విద్యార్థులు ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. పాఠశాలలో పీఎం శ్రీ నిధులతో ఏర్పాటుచేసిన వివిధ క్రీడా మైదానాలను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంగారుపాళ్యం విద్యార్థులు వాలీబాల్ తో పాటు , ఖోఖో ,త్రో బాల్ తదితర…

Read More

అంతర్ రాష్ట్ర సరిహద్దు కావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు ఐ.జి జివిజి అశోక్ కుమార్ ఐ. పోలవరం మండలం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం పోలీస్ స్టేషనులో ఏలూరు రేంజ్ ఐ.జి జివిజి అశోక్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఆయనకు పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఐ.జి మాట్లాడుతూ. ఇది అంతర్ రాష్ట్ర సరిహద్దులలో ఉన్న పోలీస్ స్టేషను, మనకు యానాం సరిహద్దులో ఉండటం వల్ల ఈ పోలీస్ స్టేషన్ ఇంపార్టెన్స్ మారింది. ఎందుకంటే స్మగ్లింగ్.. అక్కడ డ్యూటీ తక్కువ ఉండటం వల్ల లిక్కర్ గానీ, పెట్రోల్, డీజిల్ గానీ ఎక్కువ ఇటు పక్కకి స్మగ్లింగ్ అవ్వడం, అలాగే నేరస్థుల‌ కదలికలు కూడా ఉండటం మా దృష్టికి వచ్చింది. ​వీటిని‌ అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము, చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ కొన్ని యాక్టివ్…

Read More

మన అడవులను రక్షించుకుందాం – మన భవిష్యత్తును కాపాడుకుందాం. చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం అడవి అగ్ని ప్రమాదాలు ప్రకృతి సంపదకు వన్యప్ లు మన జీవన వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించడం అతి అవసరం అడవుల సంరక్షణ సమాజం సమిష్టి బాధ్యత. అడవిలో మంటలు వెలిగించవద్దు అనుమతి లేకుండా ఎటువంటి మంటలు దహన చర్యలు చేపట్టకండి ఆర్పి వేయండి. చెత్తను సక్రమంగా నిర్వహించండి ప్లాస్టిక్ గాజు సీసాలు సిగరెట్ ముక్కలు వంటి పదార్థాలను అడవిలో వదిలి వేయవద్దు. పొగ లేదా మంట కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. అగ్ని సాంకేతకాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. వన్య ప్రాణులను కాపాడండి అడవి మంటల వల్ల పులులు ఏనుగులు ఇతర జంతువుల జీవితం ప్రమాదంలో పడుతుంది. అడవిలో అప్రమత్తంగా ఉండండి అడవుల్లోకి ప్రవేశించినప్పుడు…

Read More

జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి.. వై ఎస్ ఆర్ కడప,మహి న్యూస్ ఫిబ్రవరి 25: రెవెన్యూ సమస్యల పరిష్కారం పై అధికారులు మనసుపెట్టి పని చేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయం లోని సభా భవాన్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా, డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడుతో కలసి రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప,జమ్మల మడుగు, బద్వేలు,పులివెందుల ఆర్ డి ఓ లు జాన్ ఎర్విన్,సాయి శ్రీ, చంద్రమోహన్,చిన్నయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి శాంతరాజ్, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో రెవిన్యూ సంబంధిత అంశాలైన 22 A,మ్యూటేషన్, వెబ్ ల్యాండ్ కరెక్షన్స్, 22 రెవెన్యూ సంబంధిత అంశాలపై మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర…

Read More

కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 25 : రెవిన్యూ అధికారులు అన్నిరకాల జీవోలు, చట్టాలపై అవగాహన పెంచుకుని.. తమ పనితీరు మెరుగుపరచుకొని బాధ్యతాయుతంగా, జవాబుదారి తనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సభా భవన్ లో కడప, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వో, మండల సర్వేయర్ల తో వివిధ రకాల రెవెన్యూ అంశాలపై ఒకరోజు సదస్సు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యులుగా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… రెవిన్యూ సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం మార్గదర్శకాలు మేరకు…

Read More