Author: admin

నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:- 2026 -27 సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జి. రాజకుమారి బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో అందజేశారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన మొత్తం 508 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయుల అర్హతలను పరిశీలించి, తదుపరి కమిటీ సమావేశంలో వారికి కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి జాబితాలో ఆమోదం పొందిన పాత్రికేయులు సంబంధిత డీఐపీఆర్ఓ కార్యాలయం నుండి తమ అక్రిడిటేషన్ కార్డులను స్వీకరించి, ప్రభుత్వం కల్పించిన ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐపీఆర్ఓ, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:- జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, కార్యనిర్వాహక ఇంజనీర్లు, సోలార్ వెండర్లతో కలిసి వివిధ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పీఎం-కుసుమ్-సి పథకం కింద జిల్లాలో చేపట్టిన 9 పనులలో 4 పనులకు ఇప్పటికే స్థలాలు ఖరారు చేసామని మిగిలిన పనులకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరారైన 4 పనులకు తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు పగటి పూట నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 117 ఎకరాల విస్తీర్ణంలో 29 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు…

Read More

నంద్యాల జిల్లా/బనగానపల్లి మహి న్యూస్ ఫిబ్రవరి 17 : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా సంక్షేమాన్ని మరిచిందని సిపిఐ మండల కార్యదర్శి శివయ్య అన్నారు సోమవారం సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశపరిచింది అన్నారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించక పోవడాన్ని చూస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా సంక్షేమానికి నీళ్లు వదిలేసినట్లుగా ఉందని వారన్నారు యువతకు నిరుద్యోగ భృతి మహిళలకు 1500 అమలు కాలేదని విమర్శించారు ఒకవైపు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి వి బి జి రామ్ జి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాలపై భారం మోపుతున్న గతంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉండేవి . కానీ వీ…

Read More

NARA ప్రతినిధుల వినతిని స్వీకరించిన సమాచార శాఖ డైరెక్టర్* జిల్లాల స్థాయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ చిన్న పత్రికలకు న్యాయం జరిగే దిశగా ప్రభుత్వ స్థాయిలో చర్చలు ప్రారంభం.. విజయవాడ, మహి న్యూస్ ఫిబ్రవరి 17:రాష్ట్రవ్యాప్తంగా చిన్న సర్కులేషన్ పత్రికలు ఎదుర్కొంటున్న అక్రిడిటేషన్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకుంటుందని సమాచార & ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ ఎస్. విశ్వనాథన్ తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ప్రతినిధులు సమగ్ర వినతిపత్రం సమర్పించి చిన్న పత్రికల సమస్యలను వివరించారు. NARA ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు ఆధ్వర్యంలో స్మాల్ సర్కులేటెడ్ పత్రికల ఎడిటర్లు పాల్గొని, ఇటీవల అమల్లోకి వచ్చిన ఎంపానెల్‌మెంట్ నిబంధనల వల్ల చిన్న పత్రికలు అక్రిడిటేషన్‌కు దూరమవుతున్న పరిస్థితిని వివరించారు. 🔹 చిన్న పత్రికల పరిస్థితిపై ఆందోళన ప్రతినిధులు వెల్లడించిన ముఖ్యాంశాలు: 🔹…

Read More

చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం, మహి న్యూస్, ఫిబ్రవరి 15 : చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలీశ్వర స్వామి ఆలయానికి ఆదివారం శివరాత్రి రోజున శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామిని ఉదయం నుండి రాత్రి వరకు సుమారు 40 వేల మంది భక్తులు దర్శించి ఉంటారని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామిని సుమారు పదివేల మంది వరకు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకున్నారు.గర్భిణీలు చిన్నపిల్లలు ఉచిత దర్శనంలో చాలా ఇబ్బందులు పడుతూ, ఉచిత దర్శనానికి గంట నుంచి రెండు గంటల పాటు సమయం పట్టింది.విఐపి దర్శనాలు ఎక్కువ సమయం వారికి కేటాయించడంతో సర్వదర్శనం క్యూలైన్ ₹100 క్యూ లైన్ లో ఉన్న భక్తుల కు ఇబ్బందులు తప్పలేదు.ప్రతి సంవత్సరం భక్తులకు లడ్డు…

Read More

శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 15: మాజీ సైనిక, కుటుంబ సభ్యులకు వ్యవసాయ డ్రోన్ల పై అవగాహన క్యాంపు నిర్వహించడం జరిగిందని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ అన్నారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి శైలజ ఆధ్వర్యంలో కోరమండల్, దక్ష డ్రోన్స్ సహకారంతో పెద్దపాడులో ఒక ప్రైవేట్ హోటల్ వద్ద వ్యవసాయ డ్రోన్ల అవగాహన క్యాంపు మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారిరి శైలజ మాట్లాడుతూ ఈ అవగాహనా కార్యక్రమంలో సుమారు 60 మంది పైగా మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారని అన్నారు. వ్యవసాయంలో రంగంలో డ్రోన్ల ప్రయోజనాలు, స్వయం ఉపాధి అవకాశాలు, నెలవారీ ఆదాయ సామర్థ్యాలను శ్రీనివాస్ ప్రసాద్‌ , మోహన్‌ మాజీ సైనికులు వివరించారు. ఈ అవగాహనా కార్యక్రమంపై మాజీ సైనికుల…

Read More

తెల్లవారుజామున 2.20 గంటలకు మొదటి దర్శనం ప్రారంభం భక్తులకు సమగ్ర సదుపాయాలు – 2.50 లక్షల మంది క్షేత్రంలో పాగాలంకరణకు 7 నుండి 8 వేల మందికి అనుమతి శ్రీశైలం / నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 15 :- మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 2.20 గంటల నుంచే మొదటి దర్శనం ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఆదివారం దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా జాయింట్ కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. స్వామివారు, అమ్మవార్ల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, భక్తుల రద్దీ, మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాక నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి భక్తుడు స్వామి…

Read More

అర్జీలు “meekosam.ap.gov.in” లో నమోదు చేసుకోవచ్చు సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి, 15 :- ఈ నెల 16న (సోమవారం) నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోనూ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని ఆమె చెప్పారు. అర్జీదారులు మొదట తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు అర్జీలు ఇవ్వాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే జిల్లా కేంద్రంలోని వేదికకు రావలసిందిగా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు…

Read More

చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం ఫిబ్రవరి 15. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కె.జి.సత్రం వద్ద చీకూరు పల్లి కొండపై వెలసిన శ్రీసిద్దేశ్వరస్వామి కొండకు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శివాలయానికి భక్తులు పోటెత్తారు.స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయం వద్ద భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిద్దేశ్వర స్వామిని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు నియోజకవర్గం మురళీమోహన్, కాణిపాకం ఆలయ చైర్మన్ మణి నాయుడు, కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, మండల టిడిపి గౌరవాధ్యక్షులు ఎన్ పీ జయ ప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షులు ఎన్ పీ ధరణి ప్రసాద్, మండల కార్యదర్శి జనార్దన్ గౌడ్, కోదండ యాదవ్, వల్లేరు కళ్యాణ్, మాధవ నాయుడు, మోహన్ నాయుడు,చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ఐరాల జడ్పిటిసి సుచిత్ర, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి చీకూరుపల్లి గ్రామస్తులు స్వాగతం పలికి దర్శన…

Read More

నంద్యాల మహి న్యూస్ ఫిబ్రవరి 15:- అబాకస్ మరియు వేదిక్ మ్యాధ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సత్యసాయి విద్యార్థి సత్యసాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థినులు విశ్వం ఎడ్యుటేక్ ఆధ్వర్యంలో శనివారం రోజున విజయవాడలోని మన కళ్యాణ వేదికలో నిర్వహించినటువంటి అబాకస్ మరియు వేదిక్ మ్యాధ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో వేదిక్ మ్యాధ్ వాల్యూమ్ – 1 విభాగం నందు ఎస్ కార్తీక్ అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది వేదిక్ మ్యాధ్ వాల్యూమ్ – 2 విభాగంలో కే లక్ష్మీ ప్రణీత స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అబాకస్ సీనియర్ లెవెల్ – 1 విభాగంలో సి ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి స్టేట్ 4 ర్యాంక్ సాధించడం జరిగింది అబాకస్ సీనియర్ లెవెల్ – 1 విభాగంలో విజువైలేజేషన్ విభాగం నందు ఎస్ సమీర్ కన్సలేషన్ బహుమతి…

Read More